రాష్ట్ర ప్రభుత్వం లోక్‌సభ నియోజకవర్గానికో నైపుణ్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. అందులో శిక్షణ బాధ్యతలను ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలకు అప్పగించనుంది. ఒక్కో కళాశాల ఏర్పాటుకు రూ.40 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.500 కోట్లు అవసరమవుతాయని చెబుతున్నారు. తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వ్యవసాయ కళాశాల భూముల్లో దీన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ పథకాల, దాతలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత ద్వారా నిధుల సమీకరణకు అవకాశం ఉన్నట్టు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 నైపుణ్యాభివృద్ధి కళాశాలల ఏర్పాటుకు మూలధనం కింద రూ.1000 కోట్లు, నిర్వహణ కోసం మరో రూ.128.70 కోట్లు అవసరం కానున్నట్టు తెలిపారు. ఒక్కో కళాశాలలో ఒక్కో ప్రధాన రంగంపై నైపుణ్య శిక్షణ అందించనున్నారు. కళాశాలల ఏర్పాటులో ఐటీఐలకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. వీటిల్లో స్థలం లభ్యం కాకుంటే పాలిటెక్నిక్‌లో... లేదంటే డిగ్రీ, విశ్వవిద్యాలయాల్లో నైపుణ్య కళాశాలలు చేయనున్నారు.
రాష్ట్రంలో 25 నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం
త్వరలోనే రాష్ట్రంలో 25 నైపుణ్య కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. శిక్షణ బాధ్యతలను ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలకు అప్పగించనుంది. కళాశాలల ఏర్పాటులో ఐటీఐలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో కాకుంటే పాలిటెక్నిక్, డిగ్రీ, విశ్వవిద్యాలయాల్లో ఏర్పాటు చేయనున్నారు.
త్వరలోనే రాష్ట్రంలో 25 నైపుణ్య కళాశాలల ఏర్పాటు