కృష్ణాజిల్లా మైలవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఇద్దరు వ్యక్తులపై ఆరుగురు వ్యక్తులు గొడ్డలితో దాడి చేశారు. జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామంలో స్థల వివాదానికి సంబంధించి ఇరు కుటుంబాల మధ్య గత కొద్దికాలంగా వివాదం నడుస్తోంది.
మైలవరంలో ఇద్దరు వ్యక్తులపై గొడ్డలితో దాడి - crime news krishna district
ఇద్దరు వ్యక్తులను గొడ్డలితో విచక్షణా రహితంగా.. ఆరుగురు వ్యక్తులు దాడి చేసి పరారైన ఘటన కృష్ణా జిల్లా మైలవరంలో జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![మైలవరంలో ఇద్దరు వ్యక్తులపై గొడ్డలితో దాడి six persons attack on two persons at mylavaram krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8010746-959-8010746-1594649333137.jpg)
మైలవరంలో ఇద్దరు వ్యక్తులపై గొడ్డలితో దాడి
తాజాగా ఒక కుటుంబానికి చెందిన ఉప్పతల నాగరాజు తన ఐదుగురు స్నేహితులతో కలిసి మరో కుటుంబంలోని సుధాకర్, బాలకృష్ణపై గొడ్డలితో దాడి చేసి పరారయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:సరదా తీసిన ప్రాణం: ఈతకు వెళ్లిన యువకుడు గల్లంతు
TAGGED:
crime news krishna district