శివరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని విజయవాడలో నగరోత్సవం వైభవంగా జరిగింది. ఆదిదంపతులు రథంపై సర్వాభరణాలు ధరించి భక్తకోటికి దర్శనమిచ్చారు. దుర్గామల్లేశ్వర స్వామి, భ్రమరాంభ మల్లేశ్వరస్వామి, వసంత మల్లికార్జునస్వామి ఆళయాల నుంచి ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చి కెనాల్‌రోడ్‌లోని రథంపై ఉంచారు.
మహిళల కోలాటాలు, సంకీర్తనలు, భజనలు, పులివేషాలు, ఆధ్యాత్మిక ప్రసంగాల మధ్య..... వినాయకుడి గుడి వరకు ఊరేగింపు సాగింది. అడుగడుగునా భక్తులు స్వామివారికి అఖండ స్వాగతం పలికి పూజలు నిర్వహించారు.
శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా..... స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం రాత్రి పుష్కరిణిలో భ్రమరాంభ సమేత మల్లన్న జలవిహారం చేశారు. కర్నూలు జిల్లాలోని మహనంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజున... శ్రీ కామేశ్వరీదేవి సహిత మహనందీశ్వర స్వామివారిని మయూర వాహనంపై ఊరేగించారు. యాగంటి క్షేత్రంలో ఉమామహేశ్వరుల కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి సతీసమేతంగా హాజరై పూజలు నిర్వహించారు. గూడూరు మండలం చనుగొండ్లలో నాగలింగేశ్వరస్వామి రథోత్సవానికి కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ హాజరయ్యారు. గ్రామంలో జాతర సందర్భంగా క్రికెట్, కబడ్డీ పోటీలను ప్రారంభించారు.