హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో అల్లరిమూకలు అర్ధరాత్రి రెచ్చిపోయాయి. కొందరు సిక్కు యువకులు కత్తులు పట్టుకుని స్వైర విహారం చేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. అత్తాపూర్‌లోని మారుతీనగర్‌లో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై పోయేవారిని దూషించారు. ఇరు వర్గాలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సిక్కు యువకులు కత్తులు పట్టుకుని తిరిగారు.
అల్లరిమూకలు కత్తులతో స్వైర విహారం...భయాందోళనలో స్థానికులు - హైదరాబాద్‌లో సిక్కుల ఘర్షణ
రాజేంద్రనగర్‌లో అల్లరిమూకలు రెచ్చిపోయాయి. అర్ధరాత్రి కత్తులతో కొందరు సిక్కు యువకులు స్వైర విహారం చేశారు. స్థానికులను దూషించడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఫలితంగా ఘర్షణ వాతావారణం నెలకొంది.

అల్లరిమూకలు కత్తులతో స్వైర విహారం
అల్లరిమూకలు కత్తులతో స్వైర విహారం
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అల్లరి మూకలు అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి:ఏవోబీలో వారోత్సవాల కలకలం.. అప్రమత్తంగా పోలీసు యంత్రాంగం