Sidibandi Vuthsavam: పారుపూడిలో ఘనంగా శిడిబండి సంబరం.. - krishna district latest updates
కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం పారుపూడి గ్రామంలో శ్రీపారుపూడి కనక చింతయ్య వీరమ్మతల్లి తిరునాళ్ల ఉత్సవాల్లో శిడిబండి సంబరాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. తిరునాళ్లలో 11వ రోజు సంప్రదాయంగా జరిపే ఈ పదిహేను రోజుల సంబరాలలో ఇది కీలక ఘట్టం.
ఘనంగా శిడిబండి సంబరం
కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం పారుపూడి గ్రామంలో శ్రీపారుపూడి కనక చింతయ్య వీరమ్మతల్లి తిరునాళ్ల ఉత్సవాల్లో శిడిబండి సంబరాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. 15 రోజుల తిరునాళ్లలో 11వ రోజు సంప్రదాయంగా జరిపే ఈ ఉత్సవం కీలక ఘట్టం. ఉత్సవాలను తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో జరిగే గ్రామదేవతల తిరునాళ్లలో అతిపెద్ద ఉత్సవాలలో ఒకటిగా వీరమ్మతల్లి శిడిబండి సంబరం పేరుగాంచింది.