విజయవాడ గాంధీనగర్‌లోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగింది. అయిదో అంతస్తులోని హోర్డింగ్‌కు మంటలు అంటుకున్నాయి. ముందు జాగ్రత్త చర్యగా హోటల్లో ఉన్న వారిని పోలీసులు, సిబ్బంది ఖాళీ చేయించారు. అగ్నిమాపక అధికారులు ఘటనాస్ధలానికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సకాలంలో మంటలు అదుపులోకి తేవటంతో భారీ ప్రమాదం తప్పింది.
హోటల్లో స్వల్ప అగ్నిప్రమాదం..తప్పిన ముప్పు - vijayawada news today
విజయవాడలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. గాంధీనగర్‌లోని ఓ హోటల్ హోర్డింగ్‌కు ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
విజయవాడలో స్వల్ప అగ్నిప్రమాదం
Last Updated : Oct 31, 2020, 12:30 AM IST