వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలంటూ విజయవాడ రూరల్ మండలం డిప్యూటీ తహసీల్దార్‌కు రామవరప్పాడుకు చెందిన వ్యాపారులు వినతి పత్రం అందజేశారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా మార్చి నెల నుంచి తమ షాపులన్నీ మూసివేశామని.. దుకాణాలు తెరవకపోయినా నెలవారీ అద్దెలు ఇవ్వక తప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇబ్బందుల్లో ఉన్న తమకు షాపులు తెరచుకునేందుకు అనుమతి ఇవ్వాలని వ్యాపారులు కోరుతున్నారు. దుకాణాలు మూసివేయాలని తమకు పోలీసుల నుంచి ఒత్తిడి లేకుండా చూడాలని అధికారులను కోరారు.
'వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతివ్వండి' - విజయవాడలో కరోనా కేసులు
వ్యాపారాలు చేసుకునేందుకు తమకు అనుమతి ఇవ్వాలని విజయవాడ రూరల్ మండలంలోని వ్యాపారులు అధికారులను కోరారు. మార్చి నెల నుంచి దుకాణాలు మూసినా యజమానులకు అద్దె ఇవ్వడం తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
shop owners