ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోసురువారిపాలెంలో విద్యుదాఘాతం.. రూ. 2 లక్షల ఆస్తి నష్టం - కృష్ణాజిల్లా కోసురువారిపాలెంలో షాక్ సర్క్యూట్

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసురువారిపాలెం గ్రామంలో విద్యుదాఘాతం జరిగింది. అర్థరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్​తో గ్రామానికి చెందిన గరికిపాటి వెంకటేశ్వరరావు గృహం దగ్ధమైంది. ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు.

shock circuit at kosuvaripalem in krishna district
కోసురువారిపాలెంలో షాక్ సర్క్యూట్... 2లక్షల ఆస్తి నష్టం

By

Published : Oct 21, 2020, 3:09 PM IST

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కోసురువారిపాలెం గ్రామంలో విద్యుదాఘాతంతో ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన గరికిపాటి వెంకటేశ్వరరావు గృహం... షార్ట్ సర్క్యూట్​కు గురై ఒ​క్కసారిగా మంటలు చెలరేగాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దగ్ధమయ్యాయి.

ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న వారు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అవనిగడ్డ అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు అదుపు చేశారు. సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అంచనా వేశారు.

ABOUT THE AUTHOR

...view details