మహా శివరాత్రిని పురస్కరించుకుని కృష్ణా జిల్లా యనమల కుదురులో ప్రభల ఉత్సవం వైభవంగా సాగింది. మేళ తాళాలతో పురవీధుల్లో ప్రభలను ఊరేగించారు. త్రినేత్రుడి విభిన్న రూపాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన ప్రభలు చూసేందుకు పలు ప్రాంతాల నుంచి పెద్దఎత్తున భక్తులు వచ్చారు. శివనామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగింది.
ప్రభల ఉత్సవం.. త్రినేత్రుడి దర్శనం అపూర్వం - విజయవాడలో శివరాత్రి ఉత్సవాలు
విజయవాడ సమీపంలోని యనమల కుదురులో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. గరళకంఠుడి దర్శనానికి భక్తులు పోటెత్తారు. పంచామృతాలతో ఈశ్వరుడికి అభిషేకాలు, వాహన సేవలు, ప్రభల ఊరేగింపు ఘనంగా జరిగింది.
ప్రభల ఉత్సవం.. త్రినేత్రుడి దర్శనం