ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి డా.శోభానాయుడు (64) మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంతాపం తెలిపారు. కూచిపూడి కళాకారుల్లో చాలామంది శోభానాయుడు శిష్యరికం నుంచి వచ్చినవారేనని కొనియాడారు. ఆమె భౌతికంగా దూరమైనా తన కళ ద్వారా తెలుగువారి మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని కీర్తించారు. శోభానాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్ ట్వీట్ చేశారు.
'తెలుగువారి మనసుల్లో ఆమె ఎప్పటికీ నిలిచే ఉంటారు' - నారా లోకేశ్ తాజా వార్తలు
ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి పద్మశ్రీ డా.శోభానాయుడు(64) కన్నుమూయటంపై నారా లోకేశ్ సంతాపం తెలిపారు. ఆమె భౌతికంగా దూరమైనా తన కళ ద్వారా తెలుగువారి మనసుల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని కీర్తించారు.
nara lokesh