బెజవాడ పురపాలక సంఘం 1981లో విజయవాడ నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన తర్వాత ఇంతవరకూ జరిగిన ఎన్నికల్లో మేయర్ పదవికి మూడుసార్లు ప్రత్యేక్ష ఎన్నికలు జరిగాయి. 2000లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన తాడి శకుంతల తెదేపా అభ్యర్థి పంచుమర్తి అనూరాధ చేతిలో ఓటమిపాలై మేయర్ పీఠానికి దూరమయ్యారు. అనంతరం 2005లో జరిగిన పరోక్ష ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా శకుంతల పోటీచేసి గెలుపొంది మేయర్ పీఠాన్ని దిక్కించుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మధ్య జరిగిన ఒప్పందం మేరకు ఆమె ఏడాదిపాటు మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు ఆమె నగరపాలక సంస్థ పాఠశాలలో చాలాకాలం ఉపాధ్యాయినిగా పని చేశారు. తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రత్యేక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అలా మొదిటి సారి ప్రత్యక్ష పోరాటంలో ఆమెకు అదృష్టం చేజారినా, పరోక్ష ఎన్నికల్లో మాత్రం అదృష్టం వరించడంతో మేయర్ పీఠం అధిష్టించగలిగారు.
ప్రత్యక్షంగా ఓడి.. పరోక్షంగా మేయరై..! - విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో మహిళలు తాజా వార్తలుట
1981లో విజయవాడ నగరపాలక సంస్థగా రూపాంతరం చెందిన తర్వాత ఇంతవరకూ జరిగిన ఎన్నికల్లో మేయర్ పదవికి మూడుసార్లు ప్రత్యేక్ష ఎన్నికలు జరిగాయి. 2000లో జరిగిన ప్రత్యక్ష ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా పోటీ చేసిన తాడి శకుంతల ఓటమిపాలై.. 2005లో జరిగిన పరోక్ష ఎన్నికల్లో కార్పొరేటర్ అభ్యర్థిగా గెలుపొంది పీఠం దక్కించుకున్నారు.
పరోక్షంలో మేయరైన శకుంతల
ఇవీ చూడండి...