కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో ఎస్జీఎస్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కళాశాల చైర్మన్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో చేపట్టిన ఉత్సవాలను... కళాశాల గౌరవ అధ్యక్షులు, తాత్వికులు గెంటేల వెంకటరమణ దంపతులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. మాజీ మంత్రి నెట్టెం రఘురామ్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, గెంటేల లక్ష్మీ ప్రసాద్, స్థానిక ప్రముఖులతోపాటు పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. సరస్వతి దేవి పూజ, వెంకట రమణ దంపతులకు సత్కారం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
జగ్గయ్యపేటలో ఘనంగా ఎస్జీఎస్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు - స్వర్ణోత్సవం వేడుకలు తాజా వార్తలు
కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎస్జీఎస్ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కళాశాల చైర్మన్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో కళాశాల గౌరవ అధ్యక్షులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సరస్వతి దేవి పూజతో ఉత్సవాలు మొదలయ్యాయి.
జగ్గయ్యపేటలో "ఎస్జీఎస్ కళాశాల" స్వర్ణోత్సవ వేడుకలు