ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న ప్రభుత్వ హామీ ఏమైంది' - appsc latest news

పాఠశాలల్లో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని.. కృష్ణా జిల్లా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ కార్యదర్శి ఎం. సోమేశ్వరరావు, ఎన్. నాగేశ్వరరావులు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్న ప్రభుత్వం హామీ నిలబెట్టుకోవడం లేదని అన్నారు. వైకాపా ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

sfi and dyfi on dsc
కృష్ణా జిల్లా ఎస్ఎఫ్ఐ,డీవైఎఫ్ఐ కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు, ఎన్.నాగేశ్వరరావులు

By

Published : Jan 6, 2021, 6:18 PM IST

అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీతో పోస్టులు భర్తీ చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. హామీని అమలు చేయాలని కృష్ణా జిల్లా ఎస్ఎఫ్ఐ కార్యదర్శి ఎం.సోమేశ్వరరావు విమర్శించారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న అటెండర్, స్వీపర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వ, మున్సిపల్ పాఠశాలలో పూర్తి చేయాల్సిన పనులపై వివరణ ఇవ్వాలని కోరారు. ఏపీపీఎస్సీ వార్షిక క్యాలెండర్​ను విడుదల చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్. నాగేశ్వరరావు అన్నారు.

వాగ్దానాల మీద వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి రాగానే వాటిని విస్మరించడం తగదన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. దీనితో పాటు విద్యారంగాన్ని అభివృద్ధి చేయడంలో కూడా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 77ను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్క విద్యార్థికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన వర్తింపజేయాలన్నారు. ప్రభుత్వ పథకాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు.. అర్హులైన వారందరికీ ఈ పథకాలు వర్తింపు చేయాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details