ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లి పేరుతో 'మోసం'.. కేసు పెట్టిన బాధిత కుటుంబం - క్రైమ్​ వార్తలు

అతడికి అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తి.. మాయమాటలు చెప్పి ఓ మైనర్ ను మోసం చేశాడు. గర్భవతిని చేశాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో.. దుర్గారావుపై కృష్ణా జిల్లా కూచిపూడి స్టేషన్లో కేసు నమోదైంది.

sexual assault on a minor girl at krishna district
పెళ్లి పేరుతో మైనర్​ బాలికపై లైంగిక దాడి

By

Published : Jun 12, 2021, 12:08 PM IST

కృష్ణా జిల్లా మొవ్వ మండలం నిడుమోలు బ్రాహ్మణ చెరువుకు చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఓవ్యక్తి లైంగిక దాడి(Sexual assault) చేశాడు. నిడుమోలు ఎస్టీ కాలనికి చెందిన 17 ఏళ్ల మైనర్​ పై కోట దుర్గారావు అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఆ బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసి మొహం చాటేశాడు. పెళ్లి చేసుకోనని అతడు తేల్చి చేప్పాడు. దుర్గారావుకు గతంలో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. యువతితో అతడికి పెళ్లి చేయడానికి కుల పెద్దలు రాజీ ప్రయత్నం చేసినా విఫలమైంది. చివరికి.. బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దుర్గారావుపై కూచిపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details