విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. రెండో రోజు దుర్గమ్మ బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే ఆలయ అర్చకులు అమ్మవారి దర్శనాన్ని ప్రారంభించారు. అందులో బాలాత్రిపుర సుందరీ రూపంలో ఉన్న బెజవాడ కనకదుర్గను రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, మంత్రి వెల్లంపల్లి దర్శించుకున్నారు.
VIPS IN DURGAMMA TEMPLE: ఇంద్రకీలాద్రిపై ఘనంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు.. - ap 2021 news
ఇంద్రకీలాద్రిపై బాలాత్రిపుర సుందరీ రూపంలో పూజలందుకుంటున్న కనకదుర్గను పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేకువజాము నుంచే అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు ఆలయానికి చేరుకుంటున్నారు.
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, మాజీ మంత్రి పార్థసారధి, సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.ఎస్.రావత్, సర్వే విభాగం సిద్దార్థ్ జైన్లు అమ్మ చెంతకు చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. సినీనటి శ్రియ తదితరులు కూడా కనకదుర్గమ్మ ఆలయానికి చేరుకొని బాలాత్రిపుర సుందరీ దేవిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని... కరోనా మహ్మమారి పూర్తిగా అంతం కావాలని కోరుకున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.
ఇదీ చూడండి:DEVI NAVARATHRI UTHSAVALU: బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి కళ
TAGGED:
DURGA TEMPLE TAZA