Bjp leaders complained : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరిపై పలువురు నేతలు పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మురళీధరన్‌ను ఢిల్లీలో కలిసి ఫిర్యాదు చేశారు. ఏకపక్ష నిర్ణయాల ఫలితంగా పార్టీ బలహీనపడుతోందని చెప్పారు. ఇప్పటికే ఎంతోమంది పార్టీని వీడిపోయారని గుర్తు చేస్తూ.. కనీస సమాచారం ఇవ్వకుండా పలు జిల్లాల అధ్యక్షులను కూడా తొలగించారని వాపోయారు. సుమారు 20 నిమిషాల పాటు భేటీ జరిగినట్లు తెలుస్తుండగా.. ఇకపై ప్రతీ నెల రెండుసార్లు రాష్ట్రంలో పర్యటిస్తానని మురళీధరన్ తెలిపారు. మీరు ఏ వర్గానికి చెందినవారు.. అంటూ ప్రశ్నించగా.. పార్టీ బలోపేతం కోసం పని చేసేవాళ్లం అని స్పష్టం చేసినట్లు సమాచారం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహారశైలిపై పలువురు నేతలు ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జి మురళీధరన్‌కు ఫిర్యాదు చేశారు. సోము వీర్రాజు ఏకపక్ష నిర్ణయాల కారణంగా.. అనేక మంది నేతలు పార్టీని వీడుతున్నారని, గతంలో ఎన్నడూ లేనంతగా పార్టీ దిగజారిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పలు జిల్లాల అధ్యక్షులను కనీస సమాచారం ఇవ్వకుండా... తొలగించారని, సీనియర్లను పట్టించుకోవడం లేదని మురళీధరన్‌కు చెప్పినట్లు భేటీ అనంతరం నేతలు తెలిపారు.
ప్రతీ నెల రాష్ట్రంలో రెండు సార్లు పర్యటన.. సుమారు 20 నిముషాల పాటు జరిగిన భేటీలో.. రాష్ట్ర నాయకత్వం నిర్ణయం కారణంగా జరుగుతున్న నష్టాన్ని మురళీధరన్‌కు వివరించారు. దీనికి ఆయన స్పందిస్తూ... రెండు రోజుల్లో రాజమండ్రి పర్యటన ఉందని, అక్కడ కలిసి అన్ని విషయాలు చర్చిస్తానని చెప్పారు. ఇకపై నెలలో రెండు రోజులు రాష్ట్రంలో పర్యటించనున్నట్లు మురళీధరన్ చెప్పారని.. భేటీ అనంతరం నేతలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జాతీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారని.. అది ఎప్పుడైనా ఉండొచ్చన్నారని నేతలు వెల్లడించారు.