ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వయసేమో ఏడు సంవత్సరాలు..అప్పుడే రేషన్​కార్డుకు ఓనర్

కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామానికి చెందిన ఏడేళ్ల బాలునికి కొత్త రేషన్​ కార్డును అధికారులు జారీచేశారు. బాలునికి తల్లిదండ్రులు ఉండగా.. ప్రత్యేకంగా యజమాని పేరున అతనికి కొత్త కార్డు జారీచేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇది జరిగి ఎనిమిది నెలలు గడుస్తున్నా కార్డును తొలగించకపోవడంపై బాలుడి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

seven years old boy allocated ration card individually parents requested to add in family card
వయసేమో ఏడు సంవత్సరాలు..అప్పుడే రేషన్​కార్డుకు ఓనర్

By

Published : Dec 31, 2020, 12:56 PM IST

కృష్ణాజిల్లా అవనిగడ్డ మండలం పులిగడ్డ గ్రామానికి చెందిన మైలా నాగరాజు భార్య మాధవికి ఇద్దరు పిల్లలు స్వాతి, ఓంకార శ్రీ. బాబు పేరును రేషన్ కార్డులో జత చేయుటకు గతంలో మీసేవలో దరఖాస్తు చేసుకోగా.. ఏప్రిల్​లో బాబు పేరునా కూడా కొత్త కార్డు మంజూరైందని సచివాలయ సిబ్బంది తెలిపారు. కార్డుని డిలిట్ చేయటానికి తమ లాగిన్​లో అవకాశం లేదని వారు చెప్పారు. రేషన్ కార్డు కుటుంబ పెద్ద పేరు ఓంకార శ్రీ పేరునా ఫోటోతో కూడిన కార్డుతో సహా బాలుడికి బియ్యం కూడా మంజూరు చేసి వాలంటీర్ ద్వారా ఏప్రిల్​లో ఇంటికి పంపించడం జరిగింది. అంతేకాదు లాక్​డౌన్​లో ప్రభుత్వం మంజూరు చేసిన వెయ్యి రూపాయలు నగదు కూడా బాలుడికి అందింది.

జత చేయమంటే యజమానిని చేశారు..

మా బాబుని తమ రేషన్ కార్డు లో జాయిన్ చేయమంటే ఏకంగా ఏడు సంవత్సరాల బాబుకి బియ్యం కార్డు ఇవ్వడం ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నించారు. కార్డును రద్దు చేయమని కోరగా 8 నెలల నుంచి కోరుతున్నా కార్డు రద్దు చేయడం లేదని అన్నారు. అధికారులు ఇప్పటికైనా జరిగిన పొరపాటును నిశితంగా పరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని నాగరాజు కోరుతున్నాడు.

ఇదీ చదవండి: గన్నవరం ఎమ్మెల్యే వంశీకి చేదు అనుభవం!

ABOUT THE AUTHOR

...view details