కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం పాగొలుకు చెందిన కోగంటి వెంకటేశ్వరరావు పెరటిలో ఏకంగా ఏడడుగుల పొడువున్న సొరకాయలు కాశాయి. కొడాలికి చెందిన మిత్రుని వద్ద సొర గింజలు తీసుకువచ్చి పంట కాలువ గట్టుపై 6 నెలల కిందట నాటాడు. రసాయన ఎరువులు వాడకుండా... ఆవు పేడ ఎరువు మాత్రమే వాడానని రైతు తెలిపాడు. దీంతో ఏకంగా ఏడడగుల పొడవున్న సొరకాయలు కాయడంతో... అశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వీటిని చూడటానికి స్థానికులు తరలివస్తున్నారు. వీటి విత్తనాలను.. తమ పొలంలోనూ వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే సాధారణంగా సొరకాయలు మూడు అడగుల పొడువు పెరుగుతాయని... ఈ సొర మొక్కకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల తన ఉత్పాదక శక్తి పూర్తిగా ఉపయోగించుకుని.... జన్యుపరివర్తన వల్ల ఇంత పెద్దగా పెరిగాయని ఉద్యాన సంచాలకులు దయాకరబాబు అన్నారు.
పొట్లకాయలను తలపిస్తున్న ఏడడుగుల సొరకాయ
సొరకాయలు సాధారణంగా ఒకటిన్నర నుంచి మూడడుగుల పొడవు వరకు పెరుగుతాయి. కానీ కృష్ణా జిల్లాలో మాత్రం ఏడు అడుగుల వరకు పెరిగింది. దాన్ని చూస్తుంటే సొరకాయ కాదు పొట్లకాయేమో అనిపించేలా ఉంది.
పొట్లకాయలను తలపిస్తున్న ఏడు అడుగుల సొరకాయ..