కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో విమాన సర్వీసులు ఆలస్యం అవుతున్నట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలకు విజయవాడ పరిధిలోని గన్నవరం విమానాశ్రయం జలమయమైంది. వర్షంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. సోమవారం ఉదయం వర్షం కారణంగా ఇండిగో విమానం ల్యాండ్ అయ్యేందుకు వీలులేక గాల్లోనే చక్కర్లు కొట్టింది. ఉదయం 8 గంటలకు బెంగళూరు నుంచి వచ్చిన విమానం.. సుమారు అరగంటపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం విమానం ల్యాండ్ కావడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు.
GANNAVARAM AIRPORT: అనుకూలించని వాతావరణం..గాల్లో విమానం చక్కర్లు - ap latest news
వాతావారణం సహకరించిక కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయంలో ఓ విమానం అరగంటపాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది.

వాతావరణం అనుకూలించక గాల్లో చక్కర్లు కొడుతున్న విమానం
Last Updated : Sep 27, 2021, 12:42 PM IST