Kanna Laxminarayana joined in TDP : సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశంలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు.. పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
వ్యక్తిగత విబేధాలు లేవు.. కన్నాతోపాటు భారీగా అనుచరులు ఎన్టీఆర్ భవన్ కు తరలివచ్చిన నేపథ్యంలో టీడీపీ కేంద్ర కార్యాలయం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకత ఉన్న నేత అని చంద్రబాబు తెలిపారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఎంత ఉత్సాహం ఉంటుందో.. అంతే ఉత్సాహం కన్నా చేరిక సందర్భంగా చూపించటం సంతోషకరమన్నారు. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన వ్యక్తి కన్నా.. అని అభినందించారు. రాజకీయంగా తాను, కన్నా విభేదించుకున్నామే గానీ.. అవి వ్యక్తిగతం కాదని స్పష్టం చేశారు. పెదకూరపాడులో కన్నాని ఓడించేందుకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదని,.. ఆయన ప్రజలతో అంతగా మమేకమయ్యారని వెల్లడించారు.
పెద్ద ఎత్తున టీడీపీలో చేరిక... కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా ఆ పార్టీని కాదని కన్నా తెదేపాలోకి వచ్చారంటే అది రాష్ట్ర భవిష్యత్ కోసమేనని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. సీనియర్ రాజకీయ నేత కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో తెలుగుదేశంలో చేరారు. కన్నాకు తెదేపా అధినేత చంద్రబాబు పార్టీ కండువా కప్పి తెలుగుదేశం లోకి సాదరంగా ఆహ్వానించారు. కన్నా లక్ష్మీనారాయణ తో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తెలుగుదేశంలో చేరారు. కన్నాతోపాటు భారీగా అనుచరులు ఎన్టీఆర్ భవన్ కు తరలివచ్చిన నేపథ్యంలో తెదేపా కేంద్ర కార్యాలయం పరిసరాలు కిక్కిరిసిపోయాయి.