ట్రాఫిక్ పోలీసులు కృష్ణా జిల్లా విజయవాడ మూడో పట్టణ ట్రాఫిక్ పోలీస్టేషన్లో సెమీ క్రిస్మస్ను ఘనంగా జరిపారు. నిత్యం నగరంలోని ట్రాఫిక్ నియంత్రణలో తల మునకలై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు ...ఒకచోట చేరి వేడుక నిర్వహిస్తున్నారు.
విజయవాడ మూడో పట్టణ ట్రాఫిక్ పోలీస్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు - విజయవాడలో సెమీ క్రిస్మస్ వేడుకలు వార్తలు
కృష్ణా జిల్లా విజయవాడ మూడో పట్టణ ట్రాఫిక్ పోలీస్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ప్రతి ఏడాది తమ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలా సెమి క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ అని సీఐ తెలిపారు.
విజయవాడ మూడవ పట్టణ ట్రాఫిక్ పోలీస్టేషన్లో సెమీ క్రిస్మస్ వేడుకలు
ట్రాఫిక్ పోలీస్టేషన్ పరిధిలోని సీఐలు బాలరాజు రెడ్డి, దుర్గారావులు కేక్‌ను కట్ చేశారు. మిగతా సిబ్బందికి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది తమ పోలీస్ స్టేషన్ పరిధిలో సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని సీఐలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి.ధర్మవరంలో పొగమంచు హోయలు