కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ ఊరికి ఎవరూ రావద్దని... గ్రామం నుంచి తాము బయటికి వెళ్లమంటూ... స్వచ్ఛందంగా ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు. గ్రామాలకు ఎవరూ రాకుండా తాటి చెట్లు, ముళ్ల కంచెలు రహదారిపై అడ్డంగా వేశారు. కరోనా వైరస్ వ్యాపిస్తే ఆపలేమని... అందుకే తమ ఊరిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని గ్రామ పెద్దలు చెప్పారు.
కరోనాకు కంచెతో అడ్డుకట్ట..! - boaredrs closed due to covid-19 latest updates
కృష్ణా జిల్లా వీరులపాడు మండలంలోని జగన్నాధపురం జుజ్జూరు గ్రామాల మధ్య ఆయా ఊళ్ల ప్రజలు స్వచ్ఛందంగా కంచె ఏర్పాటు చేసుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇలా చేసినట్లు తెలిపారు.
కరోనా రాకుండా కంచెతో గ్రామల మధ్య అడ్డుకట్ట
TAGGED:
live updates of corona virus