ఆర్టీసీ కార్గోలో హైదరాబాద్ నుంచి విజయవాడ, ఏలూరుకు అక్రమంగా మద్యం రవాణా జరుగుతున్నట్లు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. బెజవాడలో రవాణాను అడ్డుకుని… వారి నుంచి 11 లక్షల రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఆర్టీసీ డ్రైవర్ డబ్బుకోసమే రవాణాకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు . మద్యం అక్రమరవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని..అక్రమరవాణాకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ సైతం అమలు చేస్తున్నామని విజయవాడ ఎస్ ఈబి ప్రత్యేక అధికారి సత్తిబాబు తెలిపారు.
ఆర్టీసీ కార్గోలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం స్వాధీనం - Seized of Telangana liquor smuggled in RTC cargo
హైదరాబాద్ నుంచి విజయవాడ, ఏలూరుకు ఆర్టీసీ కార్గోలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను బెజవాడలో ఎస్ఈబీ అధికారులు అడ్డుకున్నారు. వారి నుంచి 11 లక్షల రూపాయల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు.
ఆర్టీసీ కార్గోలో అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం స్వాధీనం