కృష్ణా నదిలో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను చేరవేస్తున్న రెండు బోట్లను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సీజ్ చేశారు. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏటూరు, కాసరబాద వద్ద అనుమతులు లేకుండా అక్రమంగా బోట్లపై నదిలో ప్రయాణికులను తిప్పుతున్నారు. స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ మురళీకృష్ణ ఆధ్వర్యంలో ఆ బోట్లను సీజ్ చేశారు. ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. చందర్లపాడు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కృష్ణానదిలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న బోట్లు సీజ్ - ఏపీ తాజా వార్తలు
కృష్ణానదిలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న రెండు బోట్లను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సీజ్ చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకుని చందర్లపాడు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Seize boats