ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతమ్మ దేవస్థానంలో భద్రత పటిష్టం - Security arrangements at Tirupatamma temple after antarvedi issue

అంతర్వేది దేవాలయంలో రథం దగ్ధం అనంతరం అన్ని దేవాలయాల్లో పోలీసులు భద్రత ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానంలో ఆలయ కమిటీతో పోలీసులు సమావేశం నిర్వహించి మరింత పటిష్టంగా భద్రత చర్యలు చేపట్టారు.

Security arrangements at Tirupatamma temple
తిరుపతమ్మ దేవస్థానంలో భద్రత మరింత పటిష్టం

By

Published : Sep 14, 2020, 10:01 AM IST

అంతర్వేది దేవాలయంలో జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకొని పెనుగంచిప్రోలు తిరుపతమ్మ దేవస్థానంలో భద్రతను మరింత పటిష్టం చేశారు. ఆలయ కమిటీతో పోలీసులు సమావేశం నిర్వహించారు. భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రతలపై చర్చించారు.

తిరుపతమ్మ ఆలయ రథం చుట్టుపక్కల బారికేడ్లు, ఆలయ చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు సీసీ కెమెరాల ఫుటేజ్‌ మానిటరింగ్ చేసేందుకు కమాండ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఎవరైనా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా చర్యలు చేపడితే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై రామకృష్ణ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details