కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణంలోని 9వ వార్డు సచివాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్ గా ఉద్యోగం చేస్తున్న నాగరాజు కార్యాలయంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. జగ్గయ్యపేట కు చెందిన ఉద్యోగి స్వర్గం నాగరాజు (32)కి ఇటీవలే వివాహం జరిగింది. గురువారం సాయంత్రం సహోద్యోగులంతా వెళ్లాక అతను కార్యాలయంలోనే ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకున్నాడు. ఆలస్యం అయినా ఇంటికి రాకపోవడంతో తల్లి వాకబు చేయగా లైట్లు వెలుగుతూ తలుపులు వేసి ఉన్న కార్యాలయంలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. పోలీసులకు పిర్యాదు చేసి, అతన్ని కిందికి దింపగాఅప్పటికే మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంఘటనా స్థలంలో దొరికిన లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సంఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలిపారు.
సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య - secretariate employee suicide jaggayyapet
సచివాలయ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. అతనికి ఇటీవలె వివాహం జరిగింది.
secretariate employee suicide