Venkatram Reddy on DA and PRC fitment: ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ జీవోలు లేవని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. ఫిట్‌మెంట్ తక్కువైనా మిగిలిన విషయాల దృష్ట్యా అప్పట్లో అంగీకరించామని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ జీవోను వెంటనే వెనక్కు తీసుకోవాలని కోరారు.ప్రతి అంశంలో రాజీపడితే చరిత్ర మమ్మల్ని క్షమించదని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యల సాధనకు అన్ని సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాడేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.
"గత రెండు నెలలుగా పీఆర్సీపై ప్రభుత్వం చర్చిస్తోంది. ఉద్యోగులు ఆశించిన విధంగా పీఆర్సీ జీవోలు లేవు.అధికారుల కమిటీని మొదటి నుంచి వ్యతిరేకించాం. హెచ్‌ఆర్‌ఏ విషయంలో స్పష్టత ఇవ్వాలని గతంలో సీఎంకు చెప్పాం. ప్రభుత్వం జారీచేసిన జీవోలను ప్రతీ ఉద్యోగి వ్యతిరేకిస్తున్నారు. కొన్ని అంశాల్లో రాజీకి మేం సిద్ధమే. ప్రతి అంశంలో రాజీపడితే చరిత్ర మమ్మల్ని క్షమించదు. పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలి.ఉమ్మడి వేదికపైకి వచ్చి పోరాడేందుకు సిద్ధం. ఇవాళ సాయంత్రం సీఎం అపాయింట్‌మెంట్ కోరుతున్నాం. భవిష్యత్ కార్యాచరణపై మళ్లీ భేటీ అవుతాం" - వెంకట్రామిరెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు