ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కృష్ణా జిల్లాలో రెండో దశ వ్యాక్సినేషన్ - కృష్ణా జిల్లాలో రెండో దశ వ్యాక్సినేషన్ తాజా వార్తలు

రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ఇవాళ ప్రారంభమైంది. తొలి విడతలో వైద్యఆరోగ్య సిబ్బందికి మాత్రమే టీకా ఇవ్వగా..... రెండో విడతలో మరిన్ని శాఖల సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. కృష్ణా జిల్లాలో గతంలో 80 ఉన్న వ్యాక్సినేషన్ సెషన్ సైట్లను 100 కు పెంచినట్లు జాయింట్ కలెక్టర్ శివశంకర్ తెలిపారు.

Second phase vaccination in Krishna district
కృష్ణా జిల్లాలో రెండో దశ వ్యాక్సినేషన్

By

Published : Feb 3, 2021, 9:03 PM IST


రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ రెండో విడత మొదలైంది. రెండో విడత వ్యాక్సినేషన్ నిర్వహణ పై కృష్ణా జిల్లా వైద్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్, రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్ శాఖ సిబ్బంది ఈ విడతలో టీకాలు తీసుకుంటున్నారు. వీరితో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, 104, 108 సిబ్బంది సైతం వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. వ్యాక్సినేషన్ తరువాత తాము ఆరోగ్యంగానే ఉన్నామని .. ప్రతి ఒక్కరూ భయపడకుండా టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని వారు కోరారు.

వ్యాక్సిన్ తీసుకునే ఫ్రంట్ లైన్ సిబ్బంది వివరాలను ఆయా శాఖల అధికారులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో గతంలో 80 ఉన్న వ్యాక్సినేషన్ సెషన్ సైట్లను 100 కు పెంచామని జాయింట్ కలెక్టర్ శివశంకర్ అన్నారు. జిల్లాలో 11,802 మంది పోలీసులు, 18, 996 మున్సిపల్ సిబ్బంది, 2, 867 మంది రెవిన్యూ సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరికి కోవిషీల్డ్, కోవాక్జిన్ టీకాలను ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఎక్కడా తగ్గట్లేదు.. ప్రచారానికి సోషల్ మీడియాలో సై

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details