ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఫిబ్రవరి 13నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ ' - ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ వార్తలు

ఫిబ్రవరి 13నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మొదటి డోస్ తీసుకున్నవారు.. 28 రోజుల విరామం తర్వాత రెండో డోస్ వేసుకోవాలని ఆ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు.

'ఫిబ్రవరి 13నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ '
'ఫిబ్రవరి 13నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ '

By

Published : Feb 10, 2021, 6:10 PM IST

ఆరోగ్య కార్యకర్తలు, ఐసీడీఎస్ సిబ్బంది కొవిడ్ వ్యాక్సిన్ మొదటి డోస్​ను ఎక్కడ వేసుకున్నారో.... రెండో డోస్ కూడా అక్కడే వేసుకోవాలని వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. మొదటి డోస్ తీసుకున్న వారు.. 28 రోజుల విరామం తర్వాత రెండో డోస్ వేసుకోవాలని ఆ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ తెలిపారు.

ఫిబ్రవరి 13 నుంచి రెండో డోస్ వ్యాక్సినేషన్ మొదలవుతుందని చెప్పారు. ఈ నెల 25 తర్వాత హెల్త్ కేర్ వర్కర్లు, ఐసీడీఎస్ సిబ్బందికి మొదటి విడత వ్యాక్సినేషన్ ముగిసిపోతుందని.. ఇతర శాఖల సిబ్బంది మార్చి 5లోగా మొదటి డోస్ వ్యాక్సినేషన్ వేసుకోవాల్సి ఉందని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details