ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై పలు సూచనలు చేస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ మరో లేఖ రాశారు. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పాటించాల్సిన నిబంధనలను లేఖలో సూచించారు. ఎన్నికల జరిగే ప్రాంతాల్లో ఛైర్మన్లు, డైరెక్టర్లు ప్రయాణిస్తే దాన్ని ఎన్నికల ప్రచారం గానే భావించాలని లేఖ స్పష్టం చేశారు. పర్యటనల్లో ప్రభుత్వ వాహనాలు, సదుపాయాలు, వనరులు వినియోగించరాదని ఖరాఖండిగా చెప్పారు.
'ప్రభుత్వ వాహనాలు, సదుపాయాలు వినియోగించరాదు' - ఎన్నికల నియమావళిపై ఎస్ఈసీ లేఖ
సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ రాశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై లేఖ రాశారు. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు పాటించాల్సిన నిబంధనలు ఆ లేఖలో పేర్కొన్నారు.
sec nimmagada letter to cs on Code of Conduct for Elections
ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఫలితాలను ప్రకటించే వరకు నిబంధనలు వర్తిస్తాయని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ లేఖలో స్పష్టం చేశారు. చైర్మన్లు తమతో పాటు ప్రభుత్వ అధికారులను తీసుకుని వెళ్లవద్దని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేప్పుడు ఆ వాహనాలకు నేమ్‌బోర్డులు ఉండకూడదని లేఖలో స్పష్టం చేశారు.