ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న ఎస్ఈసీ - గణతంత్య్ర వేడుకల్లో నిమ్మగడ్డ న్యూస్

ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవాల్లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ పాల్గొన్నారు. గ్యాలరీలో కూర్చున్న ఉన్నతాధికారులు, ఐఏఎస్ అధికారులతో మాట్లాడారు.

sec and krishna collector
గణతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎస్ఈసీ
author img

By

Published : Jan 27, 2021, 8:05 AM IST

విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవానికి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హాజరయ్యారు. గవర్నర్ బిశ్వభూషణ్, ముఖ్యమంత్రి జగన్​ కంటే ముందే స్టేడియంకు చేరుకున్నారు. ఆయనకు... కలెక్టర్ ఇంతియాజ్ స్వాగతం పలికారు.

గ్యాలరీలో కూర్చున్న ఐఏఎస్ అధికారులు, రాష్ట్ర ఉన్నత విద్య నియంత్రణ కమిషన్ జస్టిస్ ఈశ్వరయ్య, సమాచార కమిషనర్లతో నిమ్మగడ్డ ముచ్చటించారు. మరో వైపు... ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్​కు ఆహ్వానాలు అందినప్పటికీ.. హైకోర్టు న్యాయమూర్తులు ఎవరూ హాజరు కాలేదు.

ABOUT THE AUTHOR

author-img

...view details