ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గరికపాడు చెక్‌పోస్ట్‌లో ఎస్ఈబీ డైరెక్టర్ తనిఖీలు - కృష్ణా జిల్లా వార్తలు

కృష్ణా జిల్లాలోని గరికపాడు చెక్‌పోస్ట్‌ను ఎస్ఈబీ డైరెక్టర్ రమేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.

Breaking News

By

Published : May 9, 2021, 12:20 PM IST

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు చెక్‌పోస్ట్‌ని ఎస్​ఈబీ డైరెక్టర్ రమేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెక్‌పోస్ట్‌ వద్ద సిబ్బంది పనితీరు, పరిస్థితులను గమనించేందుకు తనిఖీలు చేపట్టినట్లు రమేష్​రెడ్డి తెలిపారు. ఎస్ఈబీ పరిధిలో మద్యం, ఇసుక, మాదక ద్రవ్యాలు వంటి వాటిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు తెలిపారు.

కరోనా విజృంభిస్తున్న సమయంలో.. సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపేందుకు వచ్చినట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఏపీలోని అన్ని చెక్‌పోస్ట్‌ల వద్ద ఉన్న సిబ్బంది ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:మంటగలిసిన మానవత్వం: బతికుండగానే కాటికి వృద్ధురాలు !

ABOUT THE AUTHOR

...view details