దేశ స్వాతంత్ర్యోద్యమంలో శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందని భారతీయ విజ్ఞాన మండలి సభ్యులు అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా... 'ఇండియన్ ఇండిపెండెంట్ మూమెంట్ ది రోల్ ఆఫ్ సైన్స్' అనే అంశంపై విజయవాడలో కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్తల ఫొటోలు, సూక్తులతో కూడిన స్టిక్కర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విజ్ఞాన భారతి జాతీయ కార్యదర్శి జయంత్ సహస్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లక్ష స్టిక్కర్ల పోస్టర్లను పాఠశాల విద్యార్థులకు పంచిపెట్టారు. దేశం, ప్రపంచం గర్వించదగ్గ శాస్త్రవేత్తల గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని జయంత్ సహస్ర అన్నారు.
scientists stickers : విజయవాడలో శాస్త్రవేత్తల స్టిక్కర్లు అవిష్కరణ - Scientists' stickers unveiled in Vijayawada
విజయవాడలో 'ఇండియన్ ఇండిపెండెంట్ మూమెంట్ ది రోల్ ఆఫ్ సైన్స్' అనే అంశంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తల ఫొటోలు, సూక్తులతో కూడిన స్టిక్కర్లను ఆవిష్కరించారు.
విజయవాడలో శాస్త్రవేత్తల స్టిక్కర్లు అవిష్కరణ