ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అపోహలు వీడి తోక చుక్కను వీక్షించండి' - నియోవైజ్ తోకచుక్క తాజా వార్తలు

ప్రజలు అపోహలు, భయం వీడి అరుదైన నియో వైజ్ తోకచుక్కను వీక్షించాలని ఔత్సాహిక శాస్త్రవేత్త తుమ్మల శ్రీకుమార్ అన్నారు. ప్రచారంలో ఉన్నట్లు దీన్ని వీక్షించడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉండవని ఆయన స్పష్టంచేశారు. ఈ నెలాఖరుకు ఈ తోకచుక్క కనువిందు చేస్తుందని తెలిపారు.

scientise tummala srikumar about neowise comet
తుమ్మల శ్రీకుమార్, శాస్త్రవేత్త

By

Published : Jul 15, 2020, 6:35 AM IST

'నియో వైజ్ తోకచుక్క'ను వీక్షించడం వలన ఎలాంటి అరిష్టాలు, అంటువ్యాధులు ప్రబలడం లాంటివి జరగవని ఔత్సాహిక శాస్త్రవేత్త తుమ్మల శ్రీకుమార్ స్పష్టంచేశారు. విజయవాడలో మాట్లాడుతూ.. ఖగోళ రహస్యాలు ఛేదించేందుకు పరిశోధకులకు ఇదో అరుదైన అవకాశమని తెలిపారు.

జులై 14నుంచి కనిపించే ఈ తోకచుక్క నెలరోజుల వరకు ఉంటుందన్నారు. ప్రతిరోజు 5 కిలోమీటర్ల చొప్పున 20 నిమిషాలకు పైగా పెరుగుతూ కనువిందు చేస్తుందని ఆయన తెలిపారు. ఈనెల 22వ తేదీన భూమికి అతి దగ్గరగా వస్తుందని చెప్పారు. వాయువ్య దిశగా సూర్యాస్తమయం అయిన వెంటనే 20 డిగ్రీలు కోణంలో చూస్తే తోక చుక్క స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details