Science XFlora At Ramadevi Public School: వైజ్ఞానిక ప్రదర్శనలతో పిల్లల్లో సృజనాత్మకత, సైన్స్ పట్ల ఆసక్తి పెరుగుతుందని పాఠశాల పూర్వ విద్యార్థి, ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో 3రోజుల పాటు నిర్వహిస్తున్న సైన్స్ఎక్స్ఫ్లోరా ఎగ్జిబిషన్‌ను బృహతి ప్రారంభించారు. ఎగ్జిబిషన్లో పాఠశాల విద్యార్థులు రూపొందించిన పలు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ ప్రదర్శనలు ఈరోజు నుంచి బుధవారం వరకు ఉంటాయని, శనివారం విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొంటారని పాఠశాల వైస్ ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా తెలిపారు.
రమాదేవి పబ్లిక్ స్కూల్లో ఆకట్టుకున్న సైన్స్ ఎక్స్ఫ్లోరా వైజ్ఞానిక ప్రదర్శన - ramadevi public school science xflora
Science XFlora At Ramadevi Public School: తెలంగాణలోని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని రమాదేవి పబ్లిక్ స్కూల్లో సైన్స్ఎక్స్ఫ్లోరా అనే పేరుతో వైజ్ఞానిక ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. ఈ సైన్స్ఫైర్ కార్యక్రమాన్ని ఈటీవీ భారత్ డైరెక్టర్ బృహతి ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో సుమారు 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
వాతావరణ కాలుష్యాన్ని ఏ విధంగా నివారించాలని, ఔషధ మొక్కలు వాటి ప్రాధాన్యత, ప్లాస్టిక్ నియంత్రణతో పాటు రీసైక్లింగ్, సేంద్రియ వ్యవసాయం ప్రాముఖ్యత, నీటి విద్యుత్ సౌర విద్యుత్ వాటిపై అవగాహన పెంచే విధంగా విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనలు పిల్లలలో దాగి ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీయడంతో పాటు భవిష్యత్తులో ప్రపంచానికి, దేశాభివృద్ధికి ఉపయోగపడుతుందని వైస్ ప్రిన్సిపల్ ఖమర్ సుల్తానా అన్నారు. అంతేకాకుండా నూతన ఆవిష్కరణలను చేయడానికి ఇలాంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రమాదేవి ట్రస్టీ మెంబర్ రావి చంద్రశేఖర్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: