పాఠశాలకు వెళ్లడానికి దారిలేక కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరులో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు. పక్కనున్న స్థలంలో నుంచి గతంలో వారు బడికి వెళ్తుండేవారు. ఆ భూమి తనదంటూ.. ఓ వ్యక్తి దారివ్వడానికి నిరాకరించాడు. నవంబర్ నుంచి విద్యార్థులు పాఠశాలకు వెళ్లనున్నారు. ప్రస్తుత పరిస్థితితో ఏం చేయాలో పాలుపోవడం లేదని తల్లిందండ్రులు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు.
అల్లూరు పాఠశాలకు దారేది...? - అల్లూరు పాఠశాల దారి
కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరులో పాఠశాలకు చేరుకోవడానికి దారిలేదు. ఇన్నాళ్లూ తన స్థలంలో నుంచే వెళ్తున్నారంటూ.. ఓ వ్యక్తి దారి ఇవ్వడానికి నిరాకరించాడు. వచ్చే నెల నుంచి విద్యార్థులు పాఠశాలకు వెళ్లనుండటంతో.. ఏం చేయాలో తెలియక తల్లిదండ్రులు అయోమయంలో ఉన్నారు.
![అల్లూరు పాఠశాలకు దారేది...? school way blocked](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9328232-1047-9328232-1603791384790.jpg)
దారిలేక ఇబ్బంది పడుతున్న సిబ్బంది