ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సర్కారు బడుల్లో విద్యార్థులు పెరుగుతున్నారు'

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు ఉపాధ్యాయుల్లో ప్రేరణ తీసుకొస్తామని... పాఠశాల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శి అన్నారు. నాడు-నేడు కార్యక్రమంపై సమావేశం నిర్వహించి.. అభిప్రాయాలు తీసుకోనున్నట్లు వివరించారు.

school education commission
పాఠశాల విద్య నియంత్రణ కార్యదర్శి

By

Published : Dec 19, 2020, 12:06 PM IST

ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుల పనితీరును మదింపు చేస్తామని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ కార్యదర్శి సాంబశివరారెడ్డి అన్నారు. ఉపధ్యాయులు సమయానికి వస్తున్నారా.. వారు చెప్పే పాఠాలు పిల్లలు అర్థం చేసుకుంటున్నారా లేదా అనే విషయాల్ని పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అకడమిక్ ప్రమాణాలు పెంచుతామని వెల్లడించారు. సర్కారు బడుల్లో ప్రవేశాలు పెంచేందుకు ఉపాధ్యాయుల్లో ప్రేరణ తీసుకొస్తామన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో సైతం ప్రమాణాలు పాటిస్తున్నారా.. ఫీజులు ఎలా తీసుకుంటున్నారు, ఉపాధ్యాయులకు ఇచ్చే వేతనాలపైనా తనిఖీలు నిర్వహిస్తామన్నారు.

రెండో విడత నాడు-నేడు కార్యక్రమంపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మెుదటి విడత అమలుపై ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఇంజినీర్లతో సమావేశం నిర్వహించి.. అభిప్రాయాలు తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోందనీ.. కొన్ని పాఠశాలల్లో సీట్లు లేవనే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నాడు-నేడు కార్యక్రమమేనని అన్నారు.

ఇదీ చదవండి:'రాష్ట్రంలో భయానక వాతావరణానికి ఈ ఫొటో ఉదాహరణ'

ABOUT THE AUTHOR

...view details