రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులపై విద్యాశాఖ అధికారుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ పాఠశాల విద్య కమిషనర్ వీరభద్రుడు ఉత్తర్వులు జారీ చేశారు. సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు రెండు సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లగా... లేదా ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందేందుకు అవకాశం కల్పించవచ్చని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉపాధ్యాయుడు తనకు ఇష్టమైన పోస్టును ఎంపిక చేసుకోవచ్చని సూచించారు. ఒకే విడతలో జరిగే పదోన్నతి కౌన్సెలింగ్‌లో ఒక సబ్జెక్టులో పదోన్నతి తీసుకునేందుకు నిరాకరిస్తే, మరో సబ్జెక్టులో ఆ ఉపాధ్యాయునికి స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి కల్పించాలని స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని 227 జీవో ప్రకారం రెండుసార్లు మాత్రమే ఉపాధ్యాయులకు వర్తింపజేయాలని తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పదోన్నతులపై పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు - scholl education commisoner orders on school assistants
రాష్ట్రంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు రెండు సబ్జెక్టుల్లో స్కూల్ అసిస్టెంట్లగా... లేదా ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి పొందేందుకు అవకాశం ఇస్తున్నట్టు పాఠశాల విద్య కమిషనర్ వీరభద్రుడు తెలిపారు. విద్యాశాఖ అధికారుల్లో నెలకొన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
![పదోన్నతులపై పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4815352-414-4815352-1571590963060.jpg)
teac
' స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులపై పాఠశాల విద్యా కమిషనర్ ఉత్తర్వులు'
ఇదీ చూడండి:
Last Updated : Oct 20, 2019, 11:58 PM IST