ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దళిత మహిళపై గ్రామ సచివాలయ ఉద్యోగి దాడి.. పోలీసులకు పరస్పర ఫిర్యాదులు

కృష్ణాజిల్లా నందివాడ మండలం తమిరిశలో.. గ్రామ సచివాలయ ఉద్యోగి తనపై దాడి చేశాడంటూ.. దళిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జగనన్న చేదోడు పథకం రాలేదని అడిగినందుకు.. తనపై దుర్భాషలాడాడని బాధితురాలు ఆరోపణలు చేసింది. మరోవైపు మహిళ తరఫు బంధువులే.. తనపై దాడి చేశారని సచివాలయ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

sc women complaint to police on village secretariat employee at nadiwada
దళిత మహిళపై గ్రామ సచివాలయ ఉద్యోగి దాడి

By

Published : Jan 24, 2022, 6:34 PM IST



కృష్ణాజిల్లా నందివాడ మండలం తమిరిశ గ్రామ సచివాలయంలో అమానుషం జరిగింది. జగనన్న చేదోడు పథకం రాలేదని అడిగినందుకు.. గ్రామ సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్ అమానుషంగా దాడి చేశారని.. ఎస్సీ మహిళ నీలిమ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతేడాది పథకానికి ఎంపికైన తాను.. ఈసారి ఎందుకు ఎంపిక కాలేదని ప్రశ్నించినందుకు తనపై దుర్భాషలాడాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. మరోవైపు నీలిమ కుటుంబ సభ్యులే అకారణంగా తనపై దాడి చేశారని.. వెల్ఫేర్ అసిస్టెంట్ నారాయణరెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నారాయణ రెడ్డి ప్రవర్తన సక్రమంగా ఉండదని, గతంలో గ్రామ పంచాయతీ కార్యదర్శితోనూ గొడవలున్నాయని, గ్రామ వాలంటీర్లపై తరచూ దుర్భాషలాడతారనే ఆరోపణలున్నాయి. అతని నిర్లక్ష్యం కారణంగా.. గ్రామంలో 30 మంది పింఛన్లు నెలల తరబడి ఆన్​లైన్​ కావడం లేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు.

దళిత మహిళపై గ్రామ సచివాలయ ఉద్యోగి దాడి

ఇదీ చదవండి:FINANCE : ఏపీ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక శాఖలో ముగిసిన భేటీ.. త్వరలోనే శుభవార్త వస్తుందన్న ఎంపీ..!

ABOUT THE AUTHOR

...view details