ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

case filed on Devineni: దేవినేనిపై.. అట్రాసిటీ, 307 సెక్షన్లు కింద కేసు నమోదు - తెదేపా నేతల అరెస్ట్

దేవినేని ఉమ
దేవినేని ఉమ

By

Published : Jul 28, 2021, 9:21 AM IST

Updated : Jul 28, 2021, 9:59 AM IST

09:19 July 28

నందివాడ పోలీసుస్టేషన్‌లోనే తెదేపా నేత దేవినేని ఉమా

కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్‌లో ఉన్న తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమాపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. దేవినేనిపై అట్రాసిటీ, 307 సెక్షన్లు కింద జి.కొండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. దేవినేని హత్యాయత్నానికి పాల్పడినట్లు.. 307 సెక్షన్‌ కింద అభియోగాలు మోపారు.

జి.కొండూరు పీఎస్‌ వద్ద అర్ధరాత్రి తెదేపా నేతల అరెస్టు

కృష్ణా జిల్లా కొండపల్లి అటవీ ప్రాంతంలో.. గ్రావెల్‌ అక్రమ మైనింగ్‌ జరుగుతుందనే ఆరోపణలపై.. నిజనిర్ధరణకు వెళ్లిన మాజీ మంత్రి దేవినేని ఉమా, ఆయన అనుచరుల మీద.. రాళ్ల దాడి జరిగింది. ఇది వైకాపా, తెలుగుదేశం వర్గీయుల మధ్య బాహాబాహీకి దారితీసింది. పరిస్థితి చేయి దాటుతుండగా.. పోలీసులు లాఠీఛార్జి చేశారు.  

తనపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని దేవినేని ఉమా ఆందోళనకు దిగారు. సుమారు 6 గంటలపాటు కారులోనే కూర్చొని నిరసన తెలిపారు. కారు అద్దాలు పగులగొట్టి దేవినేనిని తమ వాహనంలోకి పోలీసులు ఎక్కించుకున్నారు. అనంతరం దేవినేనిని అరెస్టు చేసి పెదపారుపూడికి తరలించారు. అక్కడి నుంచి నందివాడ స్టేషన్‌కు తరలించారు.

మరో వైపు... అరెస్టైన తెదేపా నేతలు బోడె ప్రసాద్‌, పట్టాభిని వీరవల్లి తరలించాక విడిచిపెట్టారు. వీరవల్లి స్టేషన్‌లో నేతలను బాపులపాడు తెదేపా నాయకులు పరామర్శించారు. వైకాపా, తెదేపా నేతల మధ్య ఘర్షణ వాతావరణంతో నందివాడ గ్రామ సరిహద్దులను పోలీసుల నిర్బంధించారు. బారికేడ్లను ఏర్పాటు చేశారు. నందివాడ వెళ్లేందుకు తెదేపా నేతల యత్నించగా పోలీసులు అడ్డుకుంటున్నారు.

ఇదీ చదవండి:

arrest: అర్ధరాత్రి హైడ్రామా.. దేవినేని ఉమా అరెస్ట్‌

Last Updated : Jul 28, 2021, 9:59 AM IST

ABOUT THE AUTHOR

...view details