ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎస్సీ వర్గాలను రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేస్తున్నారు: డొక్కా - ఎస్సీ వర్గాలను రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేస్తున్నారు : డొక్క

సర్కార్​ను గద్దె దింపే ఆలోచనలతోనే ప్రతిపక్షాలు కుట్ర రాజకీయాలు చేస్తున్నాయని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మండిపడ్డారు. ఎస్సీ వర్గాలను రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్సీ వర్గాలను రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేస్తున్నారు : డొక్క
ఎస్సీ వర్గాలను రెచ్చగొట్టేలా దుష్ప్రచారం చేస్తున్నారు : డొక్క

By

Published : Oct 2, 2020, 7:29 PM IST

వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న దురుద్దేశంతోనే ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెంటనే కఠిన చర్యలు..

ఎస్సీలపై ఎక్కడ దాడి జరిగినా కారకులపై ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ వెంటనే కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. సీఎం జగన్ కుటుంబం అన్ని కులాల సమహారమని ఆయనకు అన్ని కులాలు సమానమేనన్నారు.

ఎస్సీ సంఘాలు..

చిత్తూరు ఘటన వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత సంఘాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇలా చేస్తే దళిత సంఘాల ఉనికే ప్రశ్నార్థకమవుతుందన్నారు. ఎస్సీలకు ఏమాత్రం అన్యాయం జరిగినా దళిత సంఘాలు ప్రభుత్వం దృష్టికి తేవాలని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : అలాంటి వారిని చూసి చప్పట్లు కొట్టాలా.. ? తెదేపా

ABOUT THE AUTHOR

...view details