ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండానే ఎస్‌బీఐలో ఉద్యోగం

ఎస్​బీఐలో ఉద్యోగం సంపాదించేందుకు పగలు, రాత్రులు కష్టపడి పరీక్ష కోసం సన్నద్ధమవుతారు. కానీ పరీక్షే లేకుండా జాబ్​ వస్తే... అబ్బా ఎంత బాగుంటుందో అనిపిస్తోంది కదా. ఇప్పుడు అది నిజం కాబోతుంది. ఎస్​బీఐలో పరీక్ష లేకుండా స్పెషలిస్ట్​ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేయనుంది.

sbi recruitment specialist officers
పరీక్ష లేకుండానే ఎస్‌బీఐలో ఉద్యోగం

By

Published : Jun 25, 2020, 10:26 PM IST

భారతీయ స్టేట్‌బ్యాంకు (ఎస్‌బీఐ) 444 స్పెషలిస్టు ఆఫీసర్ల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 13లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. తమ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి దరఖాస్తు చేయొచ్చని సూచించింది.

దరఖాస్తు చేసే అభ్యర్థులు రెజ్యూమ్‌, గుర్తింపు, వయసు ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హత, అనుభవానికి సంబంధించిన పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగార్థులు ఎలాంటి పరీక్ష రాయనవసరం లేదు. ఎస్‌బీఐ కమిటీ అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి 100 మార్కులకు ముఖాముఖి నిర్వహిస్తుంది. అందులో అర్హత మార్కులను బ్యాంకు నిర్ణయిస్తుంది. ఏ ఇద్దరికైనా కటాఫ్‌ మార్కులు సమానంగా వస్తే వయసు ఆధారంగా ఎంపిక ఉంటుందని ఎస్​బీఐ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details