ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుత్ ద్విచక్ర వాహనాలకు ఎస్​బీఐ రుణం - SBI latest updates about loans

విద్యుత్ ద్విచక్రవాహనానికి భారతదేశంలోనే తొలిసారిగా స్టేట్ బ్యాంక్​ రుణం మంజూరు చేసింది. ఈ ఘనత అవేరా కంపెనీకే దక్కిందని ఆ సంస్థ సీఈవో వెంకటరమణ తెలిపారు. విజయవాడలోని లబ్దీపేటలో రుణమంజూరు పత్రాలు మార్చుకున్నారు.

విద్యుత్ ద్విచక్రవాహనాలకు లోన్లు ఇచ్చిన ఎస్​బీఐ

By

Published : Nov 22, 2019, 4:24 PM IST

భారతదేశంలో తొలిసారిగా విద్యుత్ ద్విచక్ర వాహనానికి భారతీయ స్టేట్ బ్యాంకు రుణం మంజూరు చేయటం సంతోషంగా ఉందని అవేరా ఆ సంస్థ సీఈవో వెంకటరమణ అన్నారు. విజయవాడ లబ్బీపేటకు చెందిన ఎస్బీఐ శాఖ డివిజనల్ మేనేజర్ అరుణ్ కుమార్ సాహు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నాగేంద్ర కుమార్ చేతుల మీదుగా రుణ మంజూరు పత్రాన్ని వెంకటరమణ అందుకున్నారు. గతంలో విద్యుత్ ద్విచక్రవాహనాలకు బ్యాంకులు అందించిన దాఖలాలు లేవని... దేశంలో తొలిసారిగా అవేరా వాహనాలకు రుణం మంజూరు చేసేందుకు ముందుకు వచ్చిన ఎస్​బీఐ సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రుణం ద్వారా కొనుగోలు చేసిన తొలి వాహనాన్ని సత్య గంగాధర్ అనే వినియోగదారునికి బ్యాంకు అధికారులు అందజేశారు.

విద్యుత్ ద్విచక్రవాహనాలకు లోన్లు ఇచ్చిన ఎస్​బీఐ

ABOUT THE AUTHOR

...view details