ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రైవేట్​ ట్రావెల్స్ అక్రమాలను అరికట్టండి... ఆర్టీసీ కాపాడండి' - rtc rally in vijawada latest news

ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించి లాభాల బాట పట్టించాలంటూ... ఆర్టీసీ కార్మికులు విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్​ ట్రావెల్స్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు వినతి పత్రం ఇచ్చారు.

save rtc rally in vijayawada for good maintainance in rtc department
ఆర్టీసీని లాభాల బాట పట్టించాలంటూ విజయవాడలో ఆర్టీసీ కార్మికుల ర్యాలీ

By

Published : Dec 28, 2019, 5:52 PM IST

ఆర్టీసీని లాభాల బాట పట్టించాలంటూ విజయవాడలో కార్మికుల ర్యాలీ

రాష్ట్రంలో ఆర్టీసీ నష్టాలను నివారించి లాభాల బాట పట్టించేందుకు... ఆర్టీసీ కార్మికులు నడుం బిగించారు. బస్టాండ్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ... విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. సేవ్ ఆర్టీసీ అంటూ నినాదాలు చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల ఆర్టీసీ నష్టపోతోందని ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ పేర్కొన్నారు. అక్రమ రవాణాను అధికారులు అడ్డుకుంటున్నా ఫలితం ఉండడం లేదని చెప్పారు. ఆర్టీసీని కాపాడుకునేందుకు కార్మికులు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ ట్రావెల్స్ రవాణాపై చర్యలు తీసుకోవాలని విజయవాడ పోలీస్ కమిషనర్​కు, జిల్లా రవాణా శాఖ అధికారికి వినతి పత్రాలు ఇచ్చామన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details