ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సెంటున్నర పెట్టు.. ఈ సపోటా చెట్టు - Krishna district latest news

కృష్ణా జిల్లా ఘంటసాలలో సపోటా భారీ వృక్షంలా ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించింది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ చెట్టు భారీ తుపాన్లను సైతం తట్టుకొని నిలిచింది.

huge Sapota tree
huge Sapota tree

By

Published : Dec 23, 2020, 7:39 AM IST

మనకు సపోటా చెట్లు తెలుసుగానీ.. భారీ వృక్షాలు అరుదు. కృష్ణా జిల్లా ఘంటసాలలో సపోటా భారీ వృక్షంలా ఎదిగి శాఖోపశాఖలుగా విస్తరించింది. గ్రామంలోని వేమూరి కుటుంబం అయిదు తరాలుగా ఈ చెట్టును సంరక్షిస్తోంది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఈ చెట్టు భారీ తుపాన్లను సైతం తట్టుకొని నిలిచింది.

గ్రామానికి చెందిన వేమూరి బాబూ రాజేంద్రప్రసాద్‌ ముత్తాత వెంకట్రామయ్య- సుబ్బమ్మ దంపతులు బ్రిటిష్‌ కాలంలో తమ ఇంటి పెరట్లో మొక్కను నాటారు. అప్పటినుంచి తరాలుగా వారి కుటుంబం దీన్ని సంరక్షిస్తోంది. ఇంటి ఆవరణలో సెంటున్నర స్థలం ఆక్రమించినప్పటికీ పచ్చదనం కోసం రక్షిస్తున్నామని బాబూ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details