Sanmanam to Weight Lifter : టర్కీలో జరిగిన ఆసియా పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రజత పతకం సాధించి స్వగ్రామానికి చేరుకున్న వెయిట్ లిఫ్టర్ సంకు కృపారావుకు.. కృష్ణా జిల్లా జి.కొండూరు మండలం వెంకటాపురం గ్రామప్రజలు ఘనస్వాగతం పలికారు. ఓపెన్ టాప్ వాహనంపై ఊరేగించారు.
దారి పొడవునా కృపారావుపై పూల జల్లులు కురిపించారు స్థానికులు. ర్యాలీ అనంతరం పతక విజేత కృపారావు, ఆయన కోచ్ సకల కోటేశ్వరరావులను మైలవరం జనసేన పార్టీ నేత రామ్మోహన్ రావు సత్కరించారు.