ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాఠశాలల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు - sankranthi celebrations news

పాఠశాల, కళాశాలల్లో ముందస్తు సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. సంప్రదాయ వస్త్రాభరణాలు, రంగవళ్లులు, భోగిమంటలు, విద్యార్థుల సంస్కృతిక ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. పిల్లలకు పండుగ విశిష్టతపై అవగాహన కల్పించేందుకే ముందస్తు వేడుకలు నిర్వహించినట్లు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు తెలిపాయి.

sankranthi celebrations
పల్లె సంప్రదాయం ఉట్టిపడేలా...ముందస్తు సంక్రాంతి వేడుకలు

By

Published : Jan 11, 2020, 11:29 PM IST

తిరువూరు శ్రీనిధి ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు
గుడివాడ కళాశాలలో సంక్రాంతి వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు అంబరాన్నంటాయి. కృష్ణా జిల్లా తిరువూరు శ్రీనిధి ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దులు, భోగి మంటలు, గొబ్బెమ్మలు, రంగవల్లులు సంక్రాంతి శోభను ప్రతిబింబించాయి. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గుడివాడ ఇంజినీరింగ్​ కళాశాలలోనూ సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి.

పశ్చిమగోదావరి జిల్లా

తణుకులోని మాంటిస్సోరి పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ముగ్గుల పోటీలు, బొమ్మల కొలువులు, పిండివంటల ఘుమఘుమలతో సంక్రాంతి శోభ ముందుగానే ప్రతిబింబించింది. మున్సిపల్ ఓపెన్ ఎయిర్ థియేటర్​లో శ్రీ గౌతమి విద్యా సంస్థలు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు.

గుంటూరు జిల్లా

చిలకలూరిపేట పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు

చిలకలూరిపేటలో పలు పాఠశాలలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో సంక్రాంతి పాటలకు నృత్యాలతో అలరించారు. రామదాసు భజనలు, హరిదాసు కీర్తనలు దేవతా మూర్తుల వేషధారణలతో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది.

నెల్లూరు జిల్లా

పాఠశాలల్లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరం

నాయుడుపేట నవోదయ పాఠశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నాయకులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇదీ చదవండి:

తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా.. సంక్రాంతి సంబరాలు

ABOUT THE AUTHOR

...view details