ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విజయవాడలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు - sankranthi celebration in vijaywada

సంక్రాంతి పండగ సంబరాలు విజయవాడ నగరంలో అంబరాన్నంటుతున్నాయి. విజయవాడ నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు నగరంలోని ఇందిరా గాంధీ మున్సిపల్ మైదానం వేదికైంది. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

విజయవాడలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
విజయవాడలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

By

Published : Jan 13, 2020, 11:14 PM IST

విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానం సంక్రాంతి శోభను సంతరించుకుంది. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలతో మున్సిపల్ మైదానం హోరెత్తింది. భోగి మంటలు, బొమ్మల కొలువు, సాంస్కృతిక కార్యక్రమాలు, వంటలు, రంగ వల్లుల పోటీలతో ఒక రోజు ముందుగానే నగరంలో పండగ వాతావరణ కనిపించింది. మహిళలు, యువత సంప్రదాయ దుస్తుల్లో మైదానానికి చేరుకుని సందడి చేశారు.

పండుగ సందర్భంగా మహిళలను ఉత్సాహపరిచే ఉద్దేశంతో అధికారులు పిండివంటలు, రంగ వల్లుల పోటీలు నిర్వహించారు. అందంగా ముగ్గులు వేసి....వాటిపై రంగులు, పువ్వులతో చూడచక్కగా అలంకరించారు. బొమ్మల కొలువు సాంస్కృతిక కార్యక్రమాలు సైతం నగర వాసులను విశేషంగా అలరించాయి. నోరూరించేలా వంటకాలను తయారుచేశారు.

విజయవాడలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోనే ఈ నెల 15న సంక్రాంతి రోజున మున్సిపల్ మైదానంలో కల్చరల్ నైట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో వంటలు, రంగవల్లుల పోటీలతో పాటు....విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేయనున్నారు.

ఇవీ చదవండి

సంక్రాంతి పండగ రద్దీ.. సరిపోని రైళ్లు

ABOUT THE AUTHOR

...view details