కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని గంగూరు చేపల కుండీల సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా... మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పారిశుద్ధ్య కార్మికుడు వ్యర్థాల సేకరణలో భాగంగా జాతీయ రహదారి పక్కన నిలుచుండగా... ఉయ్యూరు వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి అతని పైకి దూసుకెళ్లింది. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. గాయపడిన మరో వ్యక్తిని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడి మృతి - పెనమలూరులో పారిశుద్ధ్య కార్మికుడు మృతి
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. నిలుచున్న ఓ పారిశుద్ధ్య కార్మికుడిని కారు ఢీకొట్టింది.
penamaluru krishna district