.
రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడి మృతి - కృష్ణాజిల్లా గుడివాడ వద్ద రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి
కృష్ణాజిల్లా గుడివాడ ఏలూరు రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందాడు. పట్టణంలో పారిశుద్ధ్య కార్యక్రమం వారం రోజులపాటు నిర్వహించాలని మంత్రి కొడాలి నాని అధికారులను అదేశించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 7 గంటలకు మంత్రి కొడాలి నాని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా.. ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొనేందుకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు రాంబాబు సైకిల్‌పై వెళ్తుండగా మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో రాంబాబు అక్కడికక్కడే మృతిచెందటంతో.. అధికారులు ఈ కార్యక్రమాన్ని రద్దు చేశారు.
రోడ్డు ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుడు మృతి